
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ ఊదరగుడి విజయ్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఒంగోలు వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
రాకిటా అనే సోషల్ మీడియా యూజర్ చేసిన పోస్ట్ చూసిన లోకేష్, “విజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా బాధ కలిగింది. తక్షణమే మా టీమ్‌ను అప్రమత్తం చేశాను. అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ స్పందించారు.
ఇది లోకేష్ మానవత్వానికి నిదర్శనం. రాజకీయాలు పక్కనబెట్టి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి సహాయం చేయడం ఆయన మనసుకు ఉన్న విశాలతను స్పష్టంగా చూపిస్తుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఆచరణలో చూపించిన లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సంఘటన నారా లోకేష్ సామాజిక బాధ్యతకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.






