
Pawan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ ఇలా రాశారు —
“సభలో ఒక శక్తివంతమైన స్వరం మాత్రమే కాకుండా, ప్రతిపక్ష ప్రశ్నలకు వాస్తవాలు, స్పష్టత, ధైర్యంతో సమాధానమివ్వగల statesmanగానూ అమిత్ షా గారు నిలుస్తున్నారు. ఆయన నాయకత్వం నిజమైన రాజకీయ నైపుణ్యానికి ప్రతిరూపం.”
అలాగే ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు కలగాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.
దేశం పట్ల ఆయన చూపుతున్న అచంచలమైన అంకితభావం, పరిపాలనలో చూపుతున్న క్రమశిక్షణకు దేశమంతా గౌరవం వ్యక్తం చేస్తోంది.



