 
                                                      Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #TheParadise నుంచి ఒక అద్భుతమైన అంతర్జాతీయ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర టీమ్ హాలీవుడ్ సూపర్‌స్టార్ రయాన్ రైనోల్డ్స్ను సినిమా ప్రెజెంటర్‌గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, SLV సినిమాస్ ప్రొడక్షన్ టీమ్ గత మూడు నెలలుగా రయాన్ రైనోల్డ్స్ టీమ్‌తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తోంది. చివరి రెండు వారాల్లో మాత్రమే వారు రయాన్ టీమ్‌తో నేరుగా కనెక్ట్ అయ్యారు అని మిడ్-డే రిపోర్ట్ చెబుతోంది.
ఇప్పటికే “#TheParadise” పాన్-ఇండియా కాకుండా గ్లోబల్ లెవెల్లో రీచ్ సాధించాలనే లక్ష్యంతో రూపొందుతోంది. రయాన్ రైనోల్డ్స్ వంటి హాలీవుడ్ స్టార్ ప్రెజెంటర్‌గా చేరితే, సినిమా స్థాయి మరింత పెరగనుంది.
ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. నాని అభిమానులు సోషల్ మీడియాలో ఈ అప్డేట్పై భారీ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు.
 
                        


