
Lokesh Prabhas
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సౌత్‌లో అత్యంత సెన్సేషన్ క్రియేటర్ లోకేశ్ కనగరాజ్ కలిసి పని చేసే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టే సమాచారం.
ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బజ్ ప్రకారం —
“#PrabhasLokeshProject almost Confirmed ✅”
ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి 5-6 భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు — అందులో Raja Saab, Spirit, Fauzi వంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత, అంటే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, ప్రభాస్ మరియు లోకేశ్ కాంబినేషన్లో సినిమా ప్రారంభమవుతుందని సమాచారం.
లోకేశ్ రూపొందించిన “Leo”, “Vikram”, “Kaithi” వంటి సినిమాలు మాస్ మరియు స్టైల్‌ను కలిపి చూపించిన విధానం అందరికీ తెలిసిందే. ఆ స్టైల్లో ప్రభాస్ లాంటి స్టార్ కనిపిస్తే అది విజువల్ బ్లాస్ట్ అవుతుందని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రాబోయే నెలల్లో వచ్చే అవకాశం ఉంది.


