
Sukumar's wife
టాలీవుడ్లో క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు #Sukumar భార్య తబిత సుకుమార్, ఇప్పుడు కొత్త అడుగు వేసింది. ఆమె స్వంత బ్యానర్ “Tabitha Sukumar Films” పేరుతో సినిమాల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
తబిత సుకుమార్ ప్రొడక్షన్ కింద రూపొందనున్న తొలి సినిమా — #Kumari22F.
2015లో వచ్చిన ‘Kumari 21F’ సినిమా అద్భుత విజయాన్ని సాధించి యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా ఈ కొత్త చాప్టర్‌ను తెరపైకి తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతోంది.
సుకుమార్ రైటింగ్స్, డెవలప్మెంట్ టీమ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని సమాచారం. మరి ‘కుమారి’ కొత్త జనరేషన్‌కు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. 🎥🔥
 
                        


