DCM Pawankalyan
తీవ్ర తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతు వెనుక ప్రభుత్వముంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు.
అవనిగడ్డలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ —
“తుఫాన్ వల్ల పంటలకు భారీ నష్టం జరిగింది. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాం. పంట నష్టాల అంచనా యుద్ధ స్థాయిలో జరుగుతోంది. పరిహార చెల్లింపులు త్వరలో ప్రారంభమవుతాయి.”
అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు.
రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే గ్రామాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
“ప్రభుత్వం ముందస్తు సన్నద్ధతతో నష్టం తీవ్రతను తగ్గించగలిగింది. 1.6 లక్షల మందిని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాము. బాధితులు ఇళ్లకు తిరిగే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తాం,”
అని ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలో రైతులు, స్థానిక ప్రజలు ఆయనతో తమ సమస్యలను పంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్నారు, సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం సూచనలు జారీ చేశారు.






