 
                                                      Varuntej
తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం “కంచె” ఈరోజుతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది.
హీరో వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా భావోద్వేగంగా పోస్ట్ చేస్తూ —
“10 years of #Kanche 🤍
A film that tested us, taught us, and changed us.
Forever grateful to my director @DirKrish, my amazing co-actors, and our incredible team who gave their all.
Thank you to the Telugu audience for making Kanche a true milestone in my journey.”
అని రాశాడు.
కృష్ణ జాగర్లమూడి (కృష్ణ) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు సినిమాలో కొత్త చరిత్రను సృష్టించింది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా ప్రేమ, మానవత్వం, సమానత్వం గురించి చెప్పిన ఈ కథ నేషనల్ అవార్డు గెలుచుకుంది — Best Regional Feature Film.
ప్రగ్యా జైస్వాల్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానులకు ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.
వరుణ్ తేజ్ తన పోస్ట్‌లో జార్జియన్ నటుడు లేవన్ సిఖారులిడ్జే గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “Thanks for all the memories, my friend 🤍” అని రాశాడు.
 
                        


