
K Ramp
గత వారం విలవిలలాడిపోయిన తెలుగు సినిమా ఈ వారం కలకలలాడబోతోంది, కారణం ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలే. తెలుసు కదా — Dude, K.Ramp, Mitramandali ఇలా చాలానే రిలీజ్ అవుతున్నాయి, వాటి రిలేటెడ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ తో హడావుడిగా ఉంది ట్విట్టర్, యూట్యూబ్.
ఇన్ని మధ్య గత వారం నాకు బాగా నచ్చిన సిట్యువేషన్లు కొన్ని ఉన్నాయి.
మొదట కిరణ్ అబ్బవరంను K.Ramp కి చేస్తున్న ప్రమోషన్. కొన్ని రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో కిరణ్ అన్నాడు — “నా సినిమా కి తమిళ్ లో థియేటర్స్ దొరకట్లేదు, కానీ ప్రదీప్ రంగనాథన్ సినిమా కి తెలుగు లో మంచి థియేటర్స్ దొరికాయి” అని.
దాన్ని Dude ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ నవీన్ గారు అడ్రెస్ చేశారు కూడా.
కానీ అదే Dude ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన దిక్కుమాలిన ప్రశ్నకు, రెండు రోజుల క్రితం జరిగిన K.Ramp ప్రెస్ మీట్ లో కిరణ్ ఒక స్టేట్మెంట్ తో మొత్తం మార్కులు కొట్టేశాడు —
“నన్ను ఆనందమా పడతాను, నేను ఈ ఇండస్ట్రీకి చెందినవాడిని, కానీ బయట ఇండస్ట్రీ వాళ్లు ఇక్కడకి వచ్చి ఇలా చేస్తే మన పరువు పోతుంది” అని చాలా డిప్లమాటిక్ గా చెప్పి అటెన్షన్ గ్రాబ్ చేశాడు.
కిరణ్ అబ్బవరంను ప్రమోషన్లలో “థప్” అని సెపరేట్ గా చెప్పక్కర్లేదు, కానీ ఈ ఇన్సిడెంట్ తో ఇంకో మెట్టు ఎక్కేశాడు.
ఇది Dude సినిమా ని ప్రమోట్ చేయడానికి పెట్టుకున్న ప్రెస్ మీట్ ని K.Ramp కి అనుకూలంగా వాడటం అంటే అదీ మామూలు విషయం కాదు.
ఇలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ, మంచి మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని మంచి మూవీస్ చేస్తే — టైర్ 1, టైర్ 2 కాదు, సీధా డ్రైవర్ సీట్ లోకి వెళ్లి స్టీరింగ్ పట్టుకుని చక్రానే తిప్పేయచ్చు.
ఇది పక్కన పెడితే ఈ నాలుగు మూవీస్ కి రిలీజ్ అయిన ట్రైలర్స్ చూసాక అనిపించింది ఏమంటే — నాలుగు సినిమాలూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్నే.
అన్ని మూవీస్ ట్రైలర్స్ బాగున్నాయి కానీ నన్ను బాగా ఆకర్షించింది అయితే K.Ramp ట్రైలరే.
సో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలలో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? కామెంట్ చేయండి.



