
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంటోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్, విలన్గా ఇమ్రాన్ హష్మీ, అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
సినిమాకు తమన్ సంగీతం అందించగా, ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఈ నెల 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
కానీ రిలీజ్కు ముందే ఓ పెద్ద షాక్ ఎదురైంది. తెలంగాణ హైకోర్టు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు పై స్టే ఆర్డర్ జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిర్ణయం రాత్రి 10 గంటలకు జరగాల్సిన ప్రీమియర్స్తో పాటు ఇప్పటికే అమ్ముడైన టికెట్లపై సందిగ్ధతను సృష్టించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్సులకు రూ.150 అదనపు రేటు, స్పెషల్ ప్రీమియర్స్కు రూ.800 టికెట్ అనుమతించగా, హైకోర్టు ఆ ఆదేశాలను రద్దు చేసింది. ఇంకా, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లకు రీఫండ్ ఇవ్వబడుతుందా లేదా అనే క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో అక్కడి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణలో సమస్య ఉన్నప్పటికీ, సినిమా మీద ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను తీసుకురాగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.



