
deepika
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లపై బహిరంగంగా స్పందించింది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ –
“నేను ఎవరిపేర్లు చెప్పాలనుకోవడం లేదు, కానీ చాలా మంది మేల్ యాక్టర్స్ సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు, వారం లో 5 రోజులు మాత్రమే పనిచేస్తున్నారు.
ఇప్పుడు చాలా మహిళలు, కొత్త తల్లులు కూడా అదే 8 గంటల షిఫ్ట్‌లు చేస్తున్నారు. కానీ అలాంటివి వార్తల్లోకి రావు.”
పే ఈక్వాలిటీపై దీపికా మాటలు
“నా కెరీర్ మొత్తంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.
పారితోషికం (పే) విషయంలో వచ్చిన ప్రతీ సమస్యను నేను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నాను.
కొన్నిసార్లు ఆ పోరాటాలు పబ్లిక్ అవుతాయి, కానీ నేను అలా పెరిగింది కాదు.
నేను వాటిని నిశ్శబ్దంగా, గౌరవంగా ఎదుర్కోవడంలో విశ్వాసం ఉంచుతాను.”
💫 దీపికా – స్ఫూర్తి దాయక స్వరంగా
దీపికా పదుకొనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆమె మానసిక బలం, ప్రశాంతత, స్ఫూర్తిదాయక ఆలోచనలను ప్రశంసిస్తున్నారు.



