 
                                                      K Ramp
#KRamp సినిమాపై ప్రేక్షకుల స్పందన ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. ఇటీవలే విదేశీ షెడ్యూల్ ముగించుకొని వచ్చిన ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ (Sreenivasa Kumar), నేరుగా ఎయిర్పోర్ట్ నుండి విశ్వనాథ్ థియేటర్ (KPHB) కి వెళ్లి సినిమా చూసినట్లు తెలిపారు.
తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆయన అన్నారు:
“విదేశీ షెడ్యూల్ తరువాత నేరుగా విశ్వనాథ్ థియేటర్‌కు వెళ్లి #KRamp చూశాను.
థియేటర్స్‌లో ప్రజలు పగలబడి నవ్వుతున్నారు.
మా బ్రదర్ @Kiran_Abbavaram తెరపై ఫుల్ ఎనర్జీతో మెరిశాడు.
థియేటర్స్ లో మామూలు ర్యాంప్ లేదు!”
అభిమానులు కూడా అదే భావనతో సోషల్ మీడియాలో ర్యాంప్ సీన్స్, డైలాగ్స్, కామెడీ సీన్స్ క్లిప్స్ షేర్ చేస్తున్నారు.
హాస్య మూవీస్, రాజేష్ డాండా, జైన్స్ నాని, మరియు యుక్తి తారేజా లు ఈ సినిమా విజయానికి తమ తమ భాగస్వామ్యంతో విశేషంగా దోహదపడ్డారు.
ప్రస్తుతం సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి రిస్పాన్స్ అందుకుంటోంది.
 
                        


