
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులను షాక్‌కి గురి చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వివేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ –
“నేను అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వెంటనే సందీప్ రెడ్డి వంగాను సంప్రదించాను. అతని విజన్, కథ చెప్పే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మేము డిన్నర్‌కి కలిశాం. ఆ రాత్రి చర్చలు ఉదయం 4 గంటల వరకు సాగాయి. అతని ఇన్టెన్సిటీ, ప్యాషన్, మాడ్నెస్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. అతను పనిచేసే ఎనర్జీ నిజంగా అసాధారణం” అని చెప్పారు.
వివేక్ మాటల్లోంచి కూడా స్పష్టంగా అర్థమవుతోంది – సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేకమైన దృక్పథంతో, ఎమోషనల్ డెప్త్‌తో బాలీవుడ్లో కూడా ప్రభావం చూపాడని.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నాడు.
ఇక వివేక్ ఒబెరాయ్ తన రాబోయే బాలీవుడ్ వెబ్ సిరీస్ మరియు సినిమాలతో బిజీగా ఉన్నాడు.



